పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ దర్శకులలో శంకర్ ఒకడు. అతను మొదటి సారి డైరెక్ట్ చేసిన జెంటిల్మెన్ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు.
అయితే అతని సినిమాలు తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ డైరెక్ట్ గా తెలుగు హీరోలతో అతను ఎప్పుడూ సినిమా చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీతో డైరెక్ట్ తెలుగు మూవీ తో మన ముందుకి వస్తున్నాడు. ఈ సినిమా ఈవెంట్ డల్లాస్ లో జరిగింది.ఆ సభలో శంకర్ మాట్లాడుతూ తెలుగు లో సినిమాలు చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేది.అలా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి గారి తోనే చేయాలనుకున్నాను.
కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటంతో మహేష్ బాబు తో ట్రై చేశాను అది కూడా వర్క్ అవుట్ కాలేదు. తర్వాత ప్రభాస్ తో మూవీ అనుకున్నాం, కరోనా సమయంలో ఆయనతో చర్చలు కూడా జరిగాయి కానీ అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు రాంచరణ్ తో నా మొదటి తెలుగు సినిమా చేయాలని రాసిపెట్టి ఉంది అందుకే అవన్నీ జరగలేదు అని చెప్పాడు శంకర్. 2021లో గేమ్ చేంజర్ మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది.
అయితే అనేక కారణాల వలన ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. మధ్యలో శంకర్ భారతీయుడు 2 సినిమా కూడా తీశాడు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ప్రభావం గేమ్ చేంజర్ పై పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఫాన్స్. అయితే ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్స్ అని సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2025 జనవరి 10న విడుదల కాబోతుంది.