రాజమౌళి రెస్పాన్స్ కి షారుఖ్ ఖాన్ రిప్లై వైరల్..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని అలాగే ఇండియా బాక్సాఫీస్ దగ్గర షేక్ ఆడిస్తున్న భారీ చిత్రం “జవాన్”. పఠాన్ లాంటి మాస్ హిట్ అనంతరం షారుఖ్ చేసిన సినిమా ఇది కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూడగా ఇదే గ్యాప్ లో అయితే సినిమా రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ప్రముఖులు నుంచి మన్ననలు అందుకోగా లేటెస్ట్ గా ఇండియా టాప్ దర్శకుడు రాజమౌళి అయితే సినిమా చూసి తన స్పందన తెలియజేసారు. ఇందుకే షారుఖ్ ని బాక్సాఫీస్ బాద్షా అని పిలిచేది డైరెక్టర్ అట్లీ నీ సక్సెస్ ని నార్త్ లో కూడా చూపించినందుకు నా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అని.

అలాగే మొత్తం టీం కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఇక దీనికి అయితే షారుఖ్ ఖాన్ కూడా వెంటనే రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. థాంక్యూ సర్ మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ నుంచే మేము కూడా చాలా నేర్చుకున్నాం. దయచేసి ఈ చిత్రాన్ని మీకు ఎప్పుడు వీలయితే అప్పుడే చూడండి.

చూసి నాకు కాల్ చెయ్యండి ఒకవేళ నేను కూడా ఒక మాస్ హీరోలాగా అనిపిస్తే చెప్పండి. హహ అంటూ నా లవ్ ఎప్పుడూ ఉంటుంది అని తాను చెప్పాడు. దీనితో ఈ క్రేజీ రిప్లై ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటితో బాలీవుడ్ జనం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.