ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్ గా మారిన ఏకైక సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” అని చెప్పి తీరాలి.
గతంలో వచ్చిన “దసరా” కంటే సాలిడ్ టాక్ ఈ సినిమా సంతరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని కనబరుస్తుంది. అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ క్రేజీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు కూడా మాస్ రన్ ని చూపించినట్టుగా తెలుస్తుంది.
కాగా మూడో రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5.7 కోట్లకి పైగా షేర్ ని రాబట్టిందట. దీనితో మొత్తంలో మూడు రోజుల్లో ఈ చిత్రం ఏపీ తెలంగాణాలో 16 కోట్లకి పైగా షేర్ ని రాబట్టి సినిమా టార్గెట్ కి అతి చెరువులోకి వచ్చేసింది. ఏపీలో బిజినెస్ దాదాపు 20 కోట్లు జరగ్గా ఆల్రెడీ 17 కోట్ల షేర్ వచ్చేసింది.
ఇక ఈ సోమవారం తర్వాత నుంచి వచ్చేవి అన్నీ లాభాలే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ వారంలో కూడా విరూపాక్ష స్ట్రాంగ్ రన్ కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చే ఏజెంట్ తో దెబ్బ పడొచ్చు ఏమో కానీ దాని ఏమన్నా తేడా అయితే మళ్ళీ ఈ చిత్రం టేకోవర్ చేస్తుందని చెప్పాలి. కాగా ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.