ఆరోజున “ప్రాజెక్ట్ కే” పై బిగ్ క్లారిటీ.!

ప్రస్తుతం రానున్న రోజుల్లో పలు భారీ చిత్రాల విషయంలో ఇండియన్ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ అండ్ కాస్ట్లీ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ నటిస్తున్న “ప్రాజెక్ట్ కే” కూడా ప్రస్తావన ఉంటుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి నేరుగా హాలీవుడ్ లెవెల్ సినిమాగా అయితే అనౌన్స్ అయ్యింది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై ఇపుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో క్రేజీ అనౌన్సమెంట్ లు ఇస్తూ ఉండగా నిన్న రాత్రే ఓ సెన్సేషనల్ అప్డేట్ ని అయితే అందించారు. కాగా ఈ అప్డేట్ అయితే ఈ చిత్ర యూనిట్ యూఎస్ లో జరిగే భారీ ఈవెంట్ కామిక్ కాన్ లో ప్రసారం చేసే క్రేజీ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే యూఎస్ లో టైమింగ్ ప్రకారం మొదట అక్కడ జూలై 20న రిలీజ్ చేయగా నెక్స్ట్ అయితే 21 న ఇండియాలో ఈ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ గ్లింప్స్ తో ఆరోజున సినిమాపై ఓ బిగ్ క్లారిటీ రానుంది అని చెప్పాలి. అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి పెట్టిన బడ్జెట్ విజువల్స్ కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది దీనితో అయితే వరల్డ్ ఆడియెన్స్ కి క్లారిటీ రానుంది.

ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ సహా దిశా పటాని దీపికా పదుకొనె లాంటి భారీ తారాగణంతో అయితే తెరకెక్కుతూ ఉండగా వైజయంతీ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.