బాక్సాఫీస్ గతిని మార్చేసిన సీనియర్ ఎన్టీఆర్ టాప్ 5 ఇండస్ట్రీ హిట్లు ఇవే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నగారుగా పాపులర్ అయిన సెలబ్రిటీ సీనియర్ ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. నిర్మాతల శ్రేయస్సును కోరుకున్న టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సీనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.

అయితే ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని ఐదు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో పాతాళభైరవి ఒకటి. ఈ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ కు స్టార్ హీరోగా గుర్తింపు దక్కడానికి ఒక విధంగా ఈ సినిమానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సినిమానే కారణమనే సంగతి తెలిసిందే.

అప్పట్లోనే ఈ సినిమా 25 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన మాయాబజార్ సైతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాను ఈతరం ప్రేక్షకులు సైతం మరిచిపోలేరు. ఈ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుని పాత్రకు తనలా మరెవరూ సూట్ కాలేరని ప్రూవ్ చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో లవకుశ సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు సీనియర్ ఎన్టీఆర్ ను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. రిపీట్ రన్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. అడవిరాముడు సినిమా ఏకంగా 3 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎన్టీఆర్ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది.