త్రిష అంటే వద్దంటున్నారట.!

టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వుంది. త్రిష, అనుష్క వంటి హీరోయిన్లు స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నందమూరి నట సింహం బాలయ్య కావచ్చు.. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఇలా ఈ సినియర్లందరికీ హీరోయిన్లు సెట్ కావడం లేదు.

హీరోలు చూస్తే హుషారుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ, హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తారు.? పోనీ వున్న స్టార్ హీరోయిన్లకైనా అవకాశాలు ఇస్తున్నారా.? అంటే కుదరడం లేదు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తమన్నాతో జత కట్టి, ఆక్షేపణల పాలయిన సంగతి తెలిసిందే. అలా అని తమన్నా వంటి హీరోయిన్లు చిరంజీవి సినిమాల్లో నటించడం వల్ల సినిమాకి పెద్దగా ఒరిగిందేమీ కూడా లేదు. పోనీ నయనతారనైనా తీసుకోవచ్చు.

అయితే, నయనతారతో కూసింత కష్టమే. ప్రమోషన్ల విషయంలో నయనతారతో కాస్త చికాకులున్నాయ్. అందుకే త్రిష లాంటి హీరోయిన్లతో జత కడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఆల్రెడీ గతంలో నటించారు కాబట్టి ఎటువంటి అభ్యంతరాలూ వుండవ్. రీసెంట్‌గా ‘ఆచార్య’ సినిమాలో త్రిష నటించాల్సి వుంది. కానీ కుదరలేదు.

ఇప్పుడు నటించడానికి సిద్ధంగా వున్నప్పటికీ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సీనియర్ హీరోలు ఈ విషయాన్ని గుర్తెరిగితే బావుంటుందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారట.