సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారో తెలియదు ఎప్పుడు ఎవరు విడాకులు ప్రకటిస్తారో తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య అధికమైంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నటువంటి కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అయితే తాజాగా మరొక జంట విడాకులకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా విలన్ గా సహాయ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేసినటువంటి సీనియర్ హీరో శ్రీకాంత్ విడాకులు తీసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీకాంత్ తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఊహ దంపతులు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు ఇప్పటికే వీరి పెద్ద కుమారుడు రోషన్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఊహకు విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఇన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న దంపతులు విడాకులు తీసుకోవడానికి గల కారణం కేవలం వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన మనస్పర్ధలు రావడమే కారణమని తెలుస్తోంది.ఇలా వీరి విడాకుల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.