Dasari Narayan Rao: సినిమా ఇండస్ట్రీలో ఒక సిస్టమ్ లేదనిపిస్తూ ఉంటుందని, సినిమా సంస్కరణలో ఇంకా మరికొన్ని మార్పులు వస్తే బాగుండేమోనని తనకు అనిపిస్తూ ఉంటుందని పసునూరి శ్రీనివాసులు అన్నారు. ఉదాహరణకు నేను సినిమా తీశాను.. దాన్ని నేను ఎలా అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, అసలు అమ్మాలా వద్దా, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్లాలి అనే విషయాలపై ఒక సిస్టమ్ అనేదే లేదని ఆయన చెప్పుకొచ్చారు. మూమూలుగా ఇండస్ట్రీపై డైరెక్ట్‌గా ఆధారపడ్డ వాళ్లు చాలా కొద్ది మందేనని.. కానీ ఇన్‌డైరెక్ట్‌గా ఒక పది లక్షల మంది ఆధారపడి ఉంటారని ఆయన చెప్పారు. అయినా కూడా ఒక సిస్టమ్ అంటూ లేదని ఆయన వాపోయారు. ఏదైనా వస్తువును తయారు చేస్తే అది మార్కెట్లో అమ్ముకోవచ్చు.. కానీ సినిమా అలా కాదు కదా అని ఆయన చెప్పారు.
ఇకపోతే ఇండస్ట్రీలో దాసరి నారాయణగారు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుందని శ్రీనివాసులు అన్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించింది గానీ, సంబంధించింది కాకపోయినా కూడా ఆయన పాత్ర ఉండేదని ఆయన చెప్పారు. ఒకవేళ అది సినిమాకు సంబంధించిన ఇష్యూ అయితే మాత్రం వాలంటీర్‌గా ఆయన మాట్లాడేవారని ఆయన అన్నారు. ఆ లోటు ఇండస్ట్రీలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.
దాసరి గారికి అంత పేరు ఒక్క రోజులోనే వచ్చింది కాదన్న శ్రీనివాసులు.. దాని కోసం ఆయన చాలా కష్టపడ్డారని శ్రీనివాసులు తెలిపారు. ఆయనకున్నట్టు ఫ్యాషన్, సినిమా మీద అభిమానం అన్నీ ఉండాలి అని, అవి ఇప్పుడున్న వాళ్లకు ఉండడం అనేది చాలా కష్టమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఆయన చనిపోయే సమయంలో ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా కూడా ఆయన్ని చూసేందుకు చాలా మంది రాలేదనే వార్తలపై పసునూరి స్పందించారు. ఆ వార్తలు తాను కూడా పేపర్లో చదివానని, నిజంగానే ఆయన్ని చూడడానికి చాలా తక్కువ మంది వెళ్లారని ఆయన చెప్పారు. దాసరి ఎంతో మంది సహకరించారన్న, తాను కూడా ఆయన కాంపౌండ్‌లో పని చేశానని, తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనేనని శ్రీనివాసులు చెప్పారు. దాసరి గారి వల్ల తనకు ఎప్పుడూ మంచే జరిగిందని, చెడు ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.