“సలార్” రెండు భాగాలు కన్ఫర్మ్ చేసిన సీనియర్ నటుడు.!

పాన్ ఇండియా మార్కెట్ లో అసలు సిసలు భారీ హైప్ ఉన్నటువంటి అతి కొద్ది చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం “సలార్” కూడా ఒకటి. దీనిపై అనేక అంచనాలు నెలకొనగా ఇప్పుడు షూటింగ్ కూడా చివరి దశకు తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అయితే గత కొన్నాళ్ల నుంచి ఒకటి కాదు రెండు భాగాలుగా అయితే తెరకెక్కుతుంది అని రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు కానీ సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా రెండు భాగాలుగానే వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా కన్నడ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటుడు దేవరాజు చేసిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమా అయితే రెండు భాగాలుగా ఉంటుంది అని నేను ఈ సినిమాలో నటిస్తున్నాను అయితే ఫస్ట్ పార్ట్ లో నాకు తక్కువ సీన్స్ ఉంటాయి కానీ సెకండ్ పార్ట్ లో ఎక్కువ సీన్స్ నాకు ఉన్నాయి అని కన్ఫర్మ్ చేశారు.

దీనితో సలార్ చిత్రం రెండు భాగాలుగా చేస్తున్నారని అయన మాటల్లో కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయ్యితే ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్స్ కూడా అయిపోతున్నాయా అనేది మరింత ఆసక్తిగా మారింది. దీనితో ఇప్పుడు ఈయన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.