విడుదలకు సిద్దంగా ‘సీతారాం సిత్రాలు’!

లక్ష్మణ్‌, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్‌ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి.నాగ శశిధర్‌ రెడ్డి దర్శకుడు. రైజింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. పెళ్లి వీసీఆర్‌ క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇదని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన మారుతి మాట్లాడుతూ ’కొత్త తరహా కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణను పొందుతాయి. ఇందులో ఆ కొత్తదనం కనిపిస్తోంది. టైటిల్‌, ట్రైలర్‌ బాగున్నా యి. సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఇప్పటికే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తయిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.