చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసా.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన మాజీ ఉపరాష్ట్రపతి?

కొన్ని సినిమాలు చిన్న సినిమాగా విడుదలయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంటాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో సీతారామం ఒకటి.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మృనాల్ ఠాకూర్ ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరింది.ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సీతారామం సినిమా వీక్షించానని చెప్పారు.ఈ సినిమా నటీనటుల నటనతో పాటు సాంకేతికత తోడై అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని ఈయన తెలిపారు. ఏ విధమైనటువంటి రణగొన ధ్వనులు లేకుండా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదింప చేసేలా ఈ సినిమాని చిత్రీకరించారంటూ ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చిత్ర బృందం ప్రశంసలు కురిపించారు.

ఈ విధంగా సీతారామం సినిమా చూసిన ఈయన చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాను చూశాను అంటూ పేర్కొన్నారు. ఈ సినిమా గురించి మాజీ ఉప రాష్ట్రపతి ఈ విధంగా స్పందించడం విశేషం. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. మరి ఈ సినిమా గురించి మాజీ ఉపరాష్ట్రపతి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.