సంక్రాంతి 2021: సినీ అభిమానులకు పండగే.. విడుదలకు సిద్ధమవుతున్న పెద్ద సినిమాలు ఇవే..!

sankranthi 2021 release movies in tollywood

మాయదారి కరోనా వల్ల దసరాకు బాక్సాఫీసు వద్ద సందడే లేదు. ప్రస్తుతం థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఒకవేళ కరోనా లేకుండా ఉండి ఉంటే.. ప్రస్తుతం థియేటర్ల వద్ద దసరా రోజున ఎంత సందడి ఉంటుందో చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ నాడు రిలీజ్ కు పెద్ద పెద్ద సినిమాలు క్యూ కడుతాయి.

sankranthi 2021 release movies in tollywood
sankranthi 2021 release movies in tollywood

కానీ.. కరోనా వల్ల ఈసారి ఏ సినిమా విడుదలకు నోచుకోలేదు. కొన్ని సినిమాలు తప్పని పరిస్థితుల్లో ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. కానీ.. ఎంతైనా థియేటర్ థియేటరే.

పెద్ద పండుగ దసరాకు తెలుగు సినిమా అభిమానులు నిరాశ చెందినా.. ప్రేక్షకులకు ఊపునిచ్చే విషయం ఏంటంటే.. సంక్రాంతి. అవును.. వచ్చే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు విడుదల కోసం క్యూ కడుతున్నాయి.

sankranthi 2021 release movies in tollywood
sankranthi 2021 release movies in tollywood

దసరా సందర్భంగా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితా వచ్చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, క్రాక్, రెడ్, అరణ్య సినిమాలు సంక్రాంతి రిలీజ్ జాబితాలో ఉన్నాయి.

ఆయా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను కూడా దసరా సందర్భంగా విడుదల చేశారు. రవితేజ సినిమా క్రాక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. శృతిహాసన్, సముద్రఖని ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు డైరెక్టర్. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు.

sankranthi 2021 release movies in tollywood
sankranthi 2021 release movies in tollywood

అలాగే.. రామ్ పొత్తినేని.. రెడ్ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు పోటీ పడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. తమిళ్ మూవీ తాడాం రీమేక్ ఇది. ఈ సినిమాలో అమృత అయ్యర్, నివేత పేతురాజ్ హీరోయిన్లు.

sankranthi 2021 release movies in tollywood
sankranthi 2021 release movies in tollywood

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమా పోస్టర్ ను కూడా తాజాగా దసరా సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్ ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది.

అలాగే.. రానా దగ్గుబాటి సినిమా అరణ్య కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది.