ఆ బాలీవుడ్ బడా దర్శకుడితో బన్నీ?

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఎక్కువగా పీరియాడిక్, హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ కథలతో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దేవదాసు సినిమా అయిన గత ఏడాది రిలీజ్ అయిన గంగూభాయ్ ఖతియావాడి మూవీ అయిన కూడా భన్సాలీ శైలి ప్రత్యేకం అని చెప్పాలి.

అందుకే బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా భన్సాలీ చిత్రాలలో నటించాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే సెలక్టివ్ గా ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. కథ సిద్ధం చేసుకొని తన స్టొరీకి ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటారు. క్యాస్టింగ్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేసే పద్ధతి అతనికి లేదు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్ లో ఒక సినిమా చేయాలని భన్సాలీ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే భన్సాలీతో సినిమా చేయడం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్ చర్చలు జరుపుతుందంట. పుష్పతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బన్నీ ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేసే అవకాశం బన్నీకి ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో స్టార్ దర్శకుడు అయిన భన్సాలీతో సినిమాకి ప్లాన్ చేస్తుననరంట.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు నడుస్తున్నాయంట. ఇక భన్సాలీ కూడా సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేపధ్యంలో బన్నీ కోసం కథ సిద్ధం చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం అది దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుందని చెప్పొచ్చు.

ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారు. తన నెక్స్ట్ సినిమా కోసం హాలీవుడ్ నటులని ఎంపిక చేయడం కోసం ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అదే ప్రాజెక్ట్ బన్నీతో చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. లేదంటే బన్నీ కోసం పీరియాడికల్ జోనర్ లో తన స్టైల్ లో ఇంకో కథని భన్సాలీ సిద్ధం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.