ఆ మధ్య హీరో శ్రీకాంత్ ఓ హీరోయిన్ గురించి కామెంట్ చేశాడు. రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా అన్నయ్య అన్నయ్య అని పిలిచేదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. మామూలుగా శ్రీకాంత్ హీరోగా సంగీత హీరోయిన్‌గా వచ్చిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. మంచి జంటగా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. అలా ఈ ఇద్దరి మధ్య రూమర్లు కూడా ఎక్కువే అయ్యాయి. కానీ అసలు విషయం శ్రీకాంత్ అలా బయట పెట్టేశాడు.
సంగీత తనను అన్నయ్య అంటూ ఉంటుందని శ్రీకాంత్ చెప్పేశాడు. అయితే ఈ విషయం ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా?. తాజాగా సంగీత కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. శ్రీకాంత్‌ను అన్నయ్య అంటూ అందరి ముందే చెప్పేసింది. తాజాగా సుమ క్యాష్ షోలో సంగీత పాల్గొంది. సంక్రాంతి స్పెషల్‌గా రాబోతోన్న క్యాష్ ఎపిసోడ్‌లో సంగీత సందడి చేయనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంగీత చేసిన కామెంట్లు, దానికి సుమ ఇచ్చిన కౌంటర్లు బాగానే వైరల్ అవుతున్నాయి.
మామూలుగా సుమ తన షోలో అందరినీ ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతుంది. బాస్కెట్ బాల్ ఆడిస్తూ.. ఓ ప్రశ్నకు రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇరుకున పెట్టేస్తుంది. అదే క్రమంలో ఈ సారి సంగీతను ఇరికించింది. మళ్లీ చాన్స్ వస్తే ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితో నటిస్తావ్ అని సుమ అడిగింది. అందుకు గానూ శ్రీకాంత్, రవితేజ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చింది. దానికి సంగీత.. శ్రీకాంత్ అన్నయ్య అని సమాధానం ఇచ్చింది. శ్రీకాంత్ అన్నయ్యా?.. అయితే రవితేజ ఏంటి? అంటూ రివర్స్ కౌంటర్ వేసింది.