ప్రభాస్ సినిమా స్టార్ట్ పై క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి..!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఇప్పుడు భారీ హైప్ లో ఉన్న కొన్ని చిత్రాల్లో ఆల్ మోస్ట్ ఉన్న వాటిలో హీరో ప్రభాస్ సినిమాలే అన్నీ ఉండగా ఈ చిత్రాల్లో ఈ ఏడాది “సలార్” చిత్రం బిగ్గెస్ట్ బ్లాస్ట్ గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని భారీ చిత్రాలు ప్రభాస్ నుంచి రానున్న రోజుల్లో వస్తున్నాయి.

అయితే ఈ సినిమాల్లో ఆల్రెడీ అనౌన్స్ అయ్యి ఉన్న సినిమాలు కూడా ఉండగా వాటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ప్లాన్ చేసిన సెన్సేషనల్ చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం అనౌన్స్ అయ్యి ఆల్రెడీ రెండేళ్లు అయ్యింది కానీ అసలు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఫైనల్ గా బిగ్గెస్ట్ అప్డేట్ ని అందించాడు. తమ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ లో స్టార్ట్  ఇచ్చాడు. అంటే ఎలా లేదన్న ఈ అవైటెడ్ సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకో ఏడాదో ఆగాల్సిందే అని చెప్పాలి. కాగా ఈ గ్యాప్ లో అయితే ప్రభాస్ పాన్ వరల్డ్ చిత్రం కల్కి లేదా మళ్ళీ సలార్ పార్ట్ 2 కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

ఇప్పటికే స్పిరిట్ ని అయితే పాన్ ఆసియ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ అవైటెడ్ కాంబినేషన్ ఎలాంటి విధ్వంసం చేస్తుందో అనేది.