గాసిప్ : మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సంయుక్త మీనన్.!

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ మరియు గోల్డెన్ లెగ్ హీరోయిన్ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” లో కీలక పాత్ర చేసి మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకోగా ఇక నెక్స్ట్ అయితే ఒకో సినిమాతో భారీ హిట్స్ అందుకుంటూ ఇక రీసెంట్ గా “విరూపాక్ష” తో సెన్సేషనల్ హిట్ అందుకొని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేసేసుకుంది.

ఇక ఇపుడు ఉన్న పోటీ హీరోయిన్స్ లో సంయుక్త కూడా తనదైన ముద్ర వేసుకోగా ఈ యంగ్ హీరోయిన్ మరిన్ని ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ లిస్ట్ లో అయితే సంయుక్త మరో బిగ్ ఆఫేర్న్ ని అందుకున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో చేయనున్న సినిమాకి అట.

మరి ఇది నిజం అయితే సంయుక్త బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నట్టే అని చెప్పాలి. ఇప్పుడు అయితే డెవిల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తుండగా ఈ తర్వాత అయితే మిగతా సినిమాలు ఉండనున్నాయి. ఇక అల్లు అర్జున్ అయితే ఇప్పుడు తన అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 తో బిజీగా ఉండగా త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ భారీ సినిమా చేస్తున్నారు.