బ్రో సినిమాకు సముద్రఖని దర్శకుడు అయినప్పటికీ కూడా దాని వెనకాల త్రివిక్రమ్ హస్తం చాలా ఎక్కువగానే ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. మొదట వినోదయసీతం కథను తెలుగులో చేయాలి అనుకున్నప్పుడు దర్శకుడు సముద్రఖని డైరెక్టుగా వెళ్లి త్రివిక్రమ్ ను కలిశాడు. అయితే ఆ సినిమా కథ విన్న తర్వాత త్రివిక్రమ్ తనకు నచ్చిన కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి అయితే బాగుంటుంది అని ఆయన ఇచ్చిన సలహాతోనే మొదటి అడుగు వేశారు. ఇక తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా త్రివిక్రమ్ ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు లోకి వచ్చాడు. అంతా కూడా త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ అయితే జరిగింది. ఇక సముద్రఖనికి ప్రత్యేకంగా తెలుగు స్క్రిప్ట్ అందించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా తనదైన శైలిలో సెట్ చేసి ఇచ్చాడు.
త్రివిక్రమ్ అయితే ఈ ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుంది అని సముద్రఖని వరుస ఇంటర్వ్యూలలో అయితే చెబుతున్నాడు. ఇక తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది ఎప్పుడు మొదలుపెడతారు అని అడిగినప్పుడు ఆయన చాలా ఆఫర్లు వస్తున్నాయి కానీ ముందుగా అయితే బ్రో సినిమాను వీలైనంత ఎక్కువగా వివిధ భాషల్లో ఇంకా రీమిక్స్ చేయాలని ఉంది అన్నారు.
ఇక తెలుగులోనే మాత్రం ఒకవేళ సినిమా చేయాలని ఉంటే త్రివిక్రమ్ గారితోనే చేస్తానేమో అని అన్నారు. త్రివిక్రమ్ గారు తనతో చాలాసార్లు మళ్లీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అంటే చెప్పు అని కూడా అన్నారు అని సముద్రఖని తెలియజేశారు. మంచి కథ సెట్ అయితే మరోసారి త్రివిక్రమ్ గారిని కలుస్తానని అప్పుడు హ్యాపీగా సినిమా చేస్తాను అని దేనికైనా టైం కలిసి రావాలి అని సముద్రఖని వివరణ ఇచ్చాడు.