తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే నటీమణులలో సమంత ముందు వరుసలో ఉంటారు. తన రోజువారి జీవితంలో ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్టింట్లో హైలెట్ అవుతారు. రీసెంట్ గానే తన తండ్రిని కోల్పోయిన సమంత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారానే సానుభూతిని కూడా అందించారు.
అలాగే తన పెంపుడు కుక్క చూపించే ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు అంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అలాగే ఈ సంవత్సరంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి సాధించిన విజయాలను గురించి కూడా ఆమె తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా సమంత తన ఇన్స్టా లో మరొక పోస్టు షేర్ చేసింది. వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అందులో ఏదైతే రాసి ఉందో అది జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
ఆ పోస్టులో ఏముందంటే వృషభ, కన్య, మకర రాశి వారు వచ్చే సంవత్సరం వృత్తిపరంగా మెరుగుపడతారని ఎన్నో ఏళ్ల నుంచి వాళ్లకున్న గోల్స్ నెరవేరుతాయి అని ఫైనాన్షియల్ గా దూసుకుపోతారని, మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. మరింత ప్రేమ నమ్మకం అందించే భాగస్వామి మీ లైఫ్ లోకి వస్తారని, పిల్లల్ని పొందుతారని ఆదాయ మార్గాలు మెరుగవుతాయని అవకాశాలు కూడా బాగా వస్తాయని రాసి ఉంది. ఆమె కలలు నిజమవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు .
ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్నారు ఈ మధ్యనే మాయోసైటిస్ నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలు,వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యారు. ఈ మధ్యనే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న సమంత తర్వాత రక్త్ బ్రహ్మాండ్, ద బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.