సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ఆమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల తన ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ ఆనారోగ్యసమస్యల నుంచి బయట పడటం కోసం ఈమె ప్రత్యేకంగా పూజలు కూడా చేయించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. సమంతకు విపరీతమైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈమె బయటకు రాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈమె అమెరికాకు వెళుతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి.అయితే ఈమె నిజంగానే స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారని స్కిన్ ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళుతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి.
మరి సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు పై క్లారిటీ రావాలంటే సమంత స్పందించాల్సి ఉంది. కానీ సమంత మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు. కేవలం ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తున్నారు తప్ప తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు సమంత మౌనానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సమంత స్పందించాల్సి ఉంది.