Bigg boss 4: అఫీషియల్.. ఈ వారం హోస్ట్ సమంత అక్కినేని? కన్ఫమ్ అయిపోయింది

samantha akkineni to host bigg boss show?

బిగ్ బాస్ తెలుగు… ప్రారంభంలో కాస్త తటపటాయించినా.. ప్రస్తుతం బిగ్ బాస్ షో దూసుకుపోతోంది. బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్లకు కఠినమైన టాస్కులు ఇస్తుండటం.. కంటెస్టెంట్లు టాస్కులు చేయడానికి గొడవలు పెట్టుకోవడం.. లాంటివి చేస్తుండటంతో బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు షోను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తున్నారంటే ఓవైపు కంటెస్టెంట్లు కారణం కాగా.. మరోవైపు హోస్ట్ నాగార్జున కారణం.

samantha akkineni to host bigg boss show?
samantha akkineni to host bigg boss show?

హోస్ట్ గా నాగార్జున షోను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆయన హోస్ మేట్స్ తో ప్రవర్తించే తీరు.. షోను నడిపించే తీరుకు ప్రేక్షకులు కూడా హేట్సాప్ చెబుతున్నారు. అందుకే.. ఈ షోకు వీకెండ్స్ లోనే ఎక్కువగా రేటింగ్స్ వస్తున్నాయి.

అయితే.. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ థాయిలాండ్ లో జరగాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆ సినిమా షూటింగ్ ను కొన్ని రోజులు గోవాలో చేశారు. తర్వాత ప్రస్తుతం కులుమనాలిలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ కూడా ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఈ వీకెండ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ కు రావడం కష్టమేనట.

గత వారమే నాగ్ రాకుండా ఉండాల్సింది కానీ.. అతి కష్టం మీద మనాలి నుంచి హైదరాబాద్ వచ్చి బిగ్ బాస్ వీకెండ్ షూటింగ్స్ లో పాల్గొని వెళ్లాడట. ఇక.. ఈ వారం రావడం మాత్రం కుదరదట.

samantha akkineni to host bigg boss show?
samantha akkineni to host bigg boss show?

దీంతో.. నాగ్ స్థానంలో ఎవరిని పెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులు యోచిస్తున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, రోజా పేర్లు బయటికి వచ్చినప్పటికీ వీళ్లెవరూ ఈసారి బిగ్ బాస్ వీకెండ్ షోను హోస్ట్ చేయడం లేదు.. ఈసారి హోస్ట్ చేసేది నాగార్జున కోడలు సమంత అక్కినేని.

అవును… ఈ వీకెండ్ షోకు తను అయితేనే బెటర్ అని నాగ్ కూడా సమంతను రికమెండ్ చేశాడట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సమంతను సంప్రదించారట. సమంత కూడా ఈ షోకు హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సమంత వస్తే వీకెండ్ ఎపిసోడ్స్ రేటింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయని బిగ్ బాస్ నిర్వాహకులు ఆశిస్తున్నారు. చూద్దాం మరి.. సమంత వీకెండ్ ఎపిసోడ్స్ లో ఎలా హోస్టింగ్ చేస్తుందో?