సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమా.!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ‘ఇంకోసారి చిరంజీవితో కలిసి నటించాలని వుంది..’ అంటూ అప్పట్లోనే సల్మాన్ ఖాన్ చెప్పాడు. ‘ఈసారి లెంగ్త్ ఇంకాస్త ఎక్కువ వుంటే బెటర్..’ అని కూడా సల్మాన్ ఖాన్ అప్పట్లో చెప్పాడు.

‘గాడ్ ఫాదర్’ సంగతి పక్కన పెడితే, మొన్నామధ్య వచ్చిన ‘కిసికీ భాయ్.. కిసీకా జాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. జగపతిబాబు ఆ సినిమాలో విలన్. పూజా హెగ్దే హీరోయిన్.

కొంత తెలుగు, కొంత ఇంగ్లీష్.. కొంత ఇంగ్లీష్.. ఇలా నడుస్తుంది ఆ సినిమా. దాన్ని హిందీ సినిమా అనాలా.? ఇంకేమన్నా అనాలా.? తెలుగుతో బాగానే కనెక్ట్ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో తెలుగు సినిమాలో నటించబోతున్నాడట సల్మాన్ ఖాన్. చిరంజీవితోనేనా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

కానీ, ఫార్మాలిటీస్ దాదాపు పూర్తయ్యాయనీ, త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతోందనీ తెలుస్తోంది సల్మాన్ ఖాన్ నటించబోయే కొత్త తెలుగు సినిమా గురించి.!