Salman Khan: గాడ్ ఫాదర్ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో మెగాస్టార్ కు అలాంటి కండీషన్ పెట్టిన సల్మాన్!

Salman Khan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు చిత్రాల షూటింగులతో బిజీగా మారిపోయారు.ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా సల్మాన్ ఖాన్ షూటింగ్ లో పాల్గొన్నారు.

సల్మాన్ ఖాన్ మెగా కుటుంబానికి మధ్య ఎంతో మంచి పరిచయం, అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మెగా కుటుంబాన్ని కలిసి వెళ్తారు. అలా వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటంతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో నటించడం కోసం రెమ్యూనరేషన్ విషయంలో సల్మాన్ ఖాన్ మెగాస్టార్ కి ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో గెస్ట్ రోల్ నటిస్తున్నందుకు ఎలాంటి పారితోషికం తీసుకోనని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. తప్పనిసరిగా తన పారితోషికం తీసుకోవాలని చెబితే తాను షూటింగ్ లోకేషన్ నుంచి వెళ్లిపోతానని సల్మాన్ ఖాన్ మెగాస్టార్ కి కండిషన్ పెట్టారు.ఈ విధంగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నారనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.