ఈ ఫార్మాట్స్ లో “సలార్” రిలీజ్..మరి ఇండియాలో.?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ తో ఉన్న చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ డ్రామానే “సలార్”. మరి దీనిని కూడా భాగాలుగానే అనౌన్స్ చేయగా ఈ సినిమాపై ఇపుడు సెన్సేషనల్ హైప్ టీజర్ తర్వాత నెలకొంది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని అయితే ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తారని ఇది వరకే టాక్ ఉంది. అందులో భాగంగా యూఎస్ లో అయితే ఈ సినిమాని ఇప్పుడు ఏ లెవెల్లో రిలీజ్ చేస్తారో తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు కూడా సలార్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

సలార్ చిత్రం డెఫినెట్ గా బిగ్గెస్ట్ స్క్రీన్ ఐమ్యాక్స్ వెర్షన్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే దీనితో పాటుగా ఈ చిత్రం 4డిఎక్స్, ఇంకా ఎక్స్ డి సహా డాల్బీ విజన్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నారని తెలుస్తుంది. దీనితో ఈ మాసివ్ ఏక్షన్ ఎంటర్టైనర్ సిల్వర్ స్క్రీన్ పై ఆ సరైన థియేటర్ లో గాని ప్లాన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి.

అయితే ఇండియాలో ఎలాంటి వెర్షన్స్ రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇక ఈ భారీ సినిమా ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తాలూకా థియేట్రికల్ ట్రైలర్ ఐతే ఈ ఆగస్ట్ చివరి వారంలో రిలీజ్ కానున్నట్టుగా మేకర్స్ కన్ఫామ్ చేశారు.