సలార్ Vs ప్రాజెక్ట్ K… కౌంట్ డౌన్ మొదలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తనదైన హవాని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ తో డిజాస్టర్ వచ్చిన ప్రభాస్ నెక్స్ట్ సినిమాల విషయంలో బజ్ మాత్రం తగ్గలేదు. బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ సాలిడ్ సక్సెస్ చూడలేదు.

అయిన సినిమా సినిమాకి అతని రేంజ్ మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఏకంగా 24 గంటల్లో 70 లక్షల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది.

దీనిని షారుఖ్ ఖాన్ జవాన్ టీజర్ కూడా బ్రేక్ చేయలేకపోయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న మరో మూవీ Project K ఫస్ట్ గ్లింప్స్ జులై 20న రిలీజ్ కాబోతోంది. అంతర్జాతీయ వేదికపై దీనిని ఆవిష్కరిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో Project K తెరకెక్కుతోంది. ప్రపంచ దృష్టిని ఈ మూవీతో ఆకర్షించాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు.

గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ ఏమైనా సలార్ టీజర్ రికార్డుని బ్రేక్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన రికార్డులని తానే బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సలార్ టీజర్ వ్యూస్ రికార్డుని సైతం బ్రేక్ చేసే అవకాశం Project K తో వచ్చింది.

ఒక వేళ బ్రేక్ చేస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. సలార్ వెర్సస్ Project K మధ్య పోటీగా మారిపోతుంది. మరి దీనిని డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా Project K ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనికైతే మిశ్రమ స్పందన వస్తోంది. మరి గ్లింప్స్ కి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది చూడాలి.