“సలార్” టీజర్ టాక్.. నీల్ అదే రొటీన్ రొట్ట

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ వచ్చిన టీజర్ ఏదన్నా ఉంది అంటే అది “సలార్” టీజర్ అనే చెప్పాలి. అసలే ఆదిపురుష్ అంతంత మాత్రమే రాణించింది. దీనితో ఫుల్ మాస్ సబ్జెక్టు అయ్యిన సలార్ మీదనే ఫ్యాన్స్ అసలు పెట్టుకోగా ఎట్టకేలకు ఈ జూలై 6 తెల్లవారు తోనే సూర్యుడు రాకముందే యూట్యూబ్ లో సలార్ వచ్చేసాడు.

అయితే ఈ సినిమా టీజర్ ఎలా ఉంది అని స్టార్ట్ చేసేకన్నా ముందు దర్శకుడు ప్రశాంత్ నీల్ కోసం చెప్పాలి. తాను కేజీఎఫ్ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే తనపై ఓవర్ ఎలివేషన్స్ అనే టాక్ ఉంది. మరి సరిగ్గా ఇదే మళ్ళీ సలార్ కి రిపీట్ చేసేసాడు. ఆల్రెడీ కేజీఎఫ్ సినిమాల్లో చూసేసిన రొటీన్ రొట్ట ఎలివేషన్ ని ప్రభాస్ పై కూడా వేసి ఫ్యాన్స్ మొహాన పడేసినట్టు అయ్యింది.

నిద్రలు మానుకొని మరీ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి మాత్రం డెఫినెట్ గా ఈ టీజర్ పెద్ద డిజప్పాయింట్మెంట్. ఇది మేము అంటుంది కాదు ఫ్యాన్స్ చెప్తున్నా మాటే. ట్విట్టర్ లో “డిజప్పాయింటెడ్” అనే ట్యాగ్ ఇండియా వైడ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఒక్క ప్రభాస్ ని తప్పితే మొత్తమ్ అంతా కేజీఎఫ్ ఫార్మాట్ లోనే కనిపిస్తుంది.

పోనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా కొత్తగా ఉందా అంటే అదీ కేజీఎఫ్ లో ఉన్నట్టే ఉంది. దీనితో జనాన్ని ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉంచిన ప్రశాంత్ నీల్ తాను కూడా దాని నుంచి బయటకి రావడం లేదా అనిపించక మానదు. మొత్తంగా ఐతే ఇప్పుడు సలార్ టీజర్ మాత్రం పెద్ద డిజప్పాయింటింగ్ అంశం అనే చెప్పాలి. 
Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj, Shruthi Haasan, Hombale Films, Vijay Kiragandur