సలార్ టీజర్… నెక్స్ట్ లెవల్ ఎలివేషన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు పవర్ ఫుల్ విలన్స్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన టీజర్ పై ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ ని అలరించే విధంగా ఉందని చెప్పాలి. టీజర్ లోకి వెళ్తే విలన్ గ్యాంగ్ మొత్తం తుపాకులు, కత్తులతో ఒక కారుని చుట్టుముడతారు. ఆ కారు దగ్గర ముసలాడు వారిని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ చెబుతాడు. సింపిల్ ఇంగ్లీష్ నో కన్ఫ్యూజన్… సింహం, పులి, చిరుత, ఏనుగు చాలా ప్రమాదకరం.

కాని జురాసిక్ పార్క్ లో కాదు… ఎందుకంటే అక్కడ ఒకడుంటాడు అని డైలాగ్ తో ఎలివేషన్ ఇస్తూ ఉంటే ప్రభాస్ ఇంట్రడక్షన్ విలన్స్ ని ఎటాక్ చేస్తూ పడుతుంది. చేత్తో కత్తి పట్టుకొని విలన్ గ్యాంగ్ కి ఒంటరి సైనికుడి తరహాలో వాదించుకుంటూ పోతాడు… ఫైనల్ గా నిస్పృహతో కూర్చున్న పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు. దీనిని బట్టి అతని మాఫియా సామ్రాజ్యాన్ని నాశనం చేసిన సలార్ గా టైటిల్ రిప్రజెంట్ చేశారు.

టీజర్ చూస్తూ ఉంటే కేజీఎఫ్ సిరీస్ కి మించిపోయే విధంగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. బ్యాగ్రోండ్ స్కోర్ మరోసారి రవి బసూర్ నెక్స్ట్ లెవల్ లో ఇచ్చారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఓవరాల్ గా టీజర్ అయితే ఫ్యాన్స్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు ఇష్టపడే అందరిని మెప్పిస్తుందని చెప్పొచ్చు.

మరి ఈ సలార్ టీజర్ ప్రభాస్ ఖాతాలో ఎన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో కేజీఎఫ్ విలన్ రామ్, ఈశ్వరిరావ్, శ్రియరెడ్డి, టిను ఆనంద్ కీలక పాత్రలలో నటించారు. కంప్లీట్ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా మొత్తాన్ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj, Shruthi Haasan, Hombale Films, Vijay Kiragandur