ఇన్సైడ్ టాక్ : “సలార్” టీం షాకింగ్ డెసిషన్..?

పాన్ ఇండియా సినిమా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ సినిమా పై హైప్ అయితే మాటల్లో చెప్పలేని రేంజ్ లో అయితే ఉంది.

దీనితో ఈ సినిమా ఎప్పుడు రిలీస్ చేసినా కూడా రికార్డు వసూళ్లు అయితే కొల్లగొడుతుంది అని ఆల్రెడీ ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ ఉండగా ఇప్పుడు సినిమా యూఎస్ లో మాసివ్ రిలీజ్ కి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటుంది.

కాగా ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం యూఎస్ లో ఉన్న ఆల్ మోస్ట్ అన్ని థియేట్రికల్ సంస్థల్లో అయితే టై అప్ అయ్యి రిలీజ్ అవుతుండగా ఇప్పుడు సలార్ నుంచి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ట్రీట్ కి సంబంధించి సినీ వర్గాల్లో అయితే ఇన్ఫో వినిపిస్తుంది.

కాగా ఇపుడు చాలా మంది ఈ చిత్రం మొదటి సాంగ్ కోసమే ఎదురు చూస్తుండగా మేకర్స్ కూడా ఈ పనుల్లోనే ఉన్నారు. అయ్యితే లేటెస్ట్ సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ అయితే అసలు సలార్ సాంగ్ ని రిలీజ్ చేయడం ఆపేస్తున్నారట.

డైరెక్ట్ గా ట్రైలర్ నే వదులుతారని ఇప్పుడు సాలిడ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాంగ్ అయితే రాదు అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బాసృర్ అయితే సంగీతాన్ని అందిస్తున్నాడు అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 28న అయితే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.