‘సలార్’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. గత నెలలో.. అంటే, సెప్టెంబర్‌లోనే సినిమా విడుదల కావాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. డిసెంబర్‌లో సినిమా రిలీజ్.. అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ప్చ్.. అయినాగానీ, ‘నమ్మలేం బ్రదర్’ అంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రస్తుతం ‘సలార్’ సినిమాకి సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ జరుగుతోందిట. కాదు కాదు, రీ-షూట్.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదేంటీ, ప్రభాస్ ఇటీవల చిన్నపాటి సర్జరీ చేయించుకుని, రెస్ట్ తీసుకున్నాడు కదా.? అంటే, డూప్‌తో రీ-షూట్ సీన్స్ మేనేజ్ చేస్తున్నారంటూ ప్రచారం తెరపైకొస్తోంది. ఇదంతా కావాలనే నడుస్తోన్న పెయిడ్ నెగెటివిటీ అనుకోవాలా.? నిజంగానే, రీ-షూట్ జరుగుతోందా.?
గత కొంతకాలంగా, ప్రభాస్ సినిమాలేవీ అనుకున్న సమయానికి రావడంలేదు. అత్యంత భారీతనమే అందుక్కారణం. ప్రశాంత్ నీల్ చాలా ప్లానింగ్‌తో సినిమాలు తీసే దర్శకుడన్న గుర్తింపు పొందాడు. కానీ, ఇక్కడ ‘సలార్’ విషయంలో అంతా తేడా కొట్టేస్తూనే వుంది.
ఈ ఏడాది ‘సలార్’ విడుదలయ్యే అవకాశమే లేదన్న పుకార్లతో, సంక్రాంతి సినిమాలు కంగారు పడుతున్నాయట. డిసెంబర్ నుంచి వాయిదా పడితే సంక్రాంతి కాదు, సమ్మర్‌కే.. అన్నది సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న ఓ గుసగుస.
నిజమేనంటారా.?