ఇండస్ట్రీ టాక్ : భారీ నిడివితో రాబోతున్న “సలార్ పార్ట్ 1”

ఇప్పుడు ఇండియా సినిమా దగ్గర ఉన్న పలు భారీ అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రమే “సలార్ సీజ్ ఫైర్”. కాగా ఈ భారీ చిత్రం ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే పది కేజీఎఫ్ చిత్రాలని కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఉంటుంది అని తెలిపాడు.

దీనితో అంచనాలు ఈ చిత్రానికి పీక్స్ లోకి వెళ్లిపోగా ఇక రిలీజ్ డేట్ కోసం మాత్రమే అంతా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ అవైటెడ్ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ లో వస్తుండగా సలార్ పార్ట్ 1 పై క్రేజీ అప్డేట్ ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో ఈ సినిమాకి మేకర్స్ భారీ రన్ టైం ని కట్ చేశారట.

దీనితో సలార్ ఏకంగా మూడు గంటల దగ్గర వచ్చేసింది అని అంటున్నారు. కాగా మొత్తంగా ఈ సినిమా 2 గంటల 55 నిమిషాల పాటుగా వచ్చిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎలా లేదన్న థియేటర్స్ లో సలార్ విధ్వంసం మూడు గంటలకి పైగానే ఫ్యాన్స్ కి ఉంటుంది అని చెప్పాలి.

మరి టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా ఇండియన్ సినిమా దగ్గర చాలా రికార్డులని ఈ చిత్రం గల్లంతు చేసేస్తుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా శ్రేయ రెడ్డి పృథ్వీ రాజ్ తదితరులు నటించారు. కాగా మేకర్స్ ఈ చిత్రాన్ని కేజీఎఫ్ తో లింకప్ చేసి దీనిని కూడా రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు.