డిజాస్టర్స్ సంస్థకి “సలార్” హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు..!

ఇప్పుడు ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో నటించగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే గత కొన్నాళ్ల నుంచి చిత్ర యూనిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరు ఇండియా వైడ్ గా చేస్తున్నారో రివీల్ చేశారు.

అలా మొన్నటివరకు సౌత్ ఇండియా లో రివీల్ చేశారు. ఇక ఫైనల్ గా అయితే ఈ సినిమా హక్కులు హిందీలో ఎవరికి వెళ్తాయి ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ మార్కెట్ లో మంచి బ్రాండ్ అయినటువంటి ఆ ఫిల్మ్స్ వారు సొంతం చేసుకోగా ఈ సంస్థ టోటల్ నార్త్ ఇండియాలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సంస్థకి తెలుగు నుంచి కానీ తెలుగు హీరోస్ నుంచి కానీ రిలీజ్ చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ లు గానే ఉన్నాయి. డిజాస్టర్ లు అంటే అవి మామూలు నష్టాలు ఇచ్చిన చిత్రాలు కాదు ఆ రేంజ్ నష్టాలు ఇచ్చిన సినిమాలే ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు నటించిన “స్పైడర్” అలాగే విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” చిత్రాలు.

ఇవి హిందీలో పక్కన పెడితే మన దగ్గర ఎంత ఘోరంగా డిజాస్టర్ అయ్యాయో తెలిసిందే. మరి అలాంటిది ఈ సంస్థ ఇపుడు “సలార్” ని విడుదల చేస్తుండడం గమనార్హం. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. 
https://x.com/SalaarTheSaga/status/1725812427529605189?s=20