వైరల్ : బుక్ మై షో లో “సలార్” సరికొత్త రిలీజ్ డేట్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి గడిచిన రెండు మూడు రోజులు నుంచి కూడా “సలార్” నామ స్మరణే పాన్ ఇండియా సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తుండగా ఆల్ మోస్ట్ సినిమా వాయిదానే అన్నట్టుగా రూమర్స్ ఊపందుకున్నాయి.

ఇక వీటితో పాటుగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారగా. ఇప్పుడు అయితే మేకర్స్ ఈ నవంబర్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా రూమర్స్ వైరల్ అవుతుంటే మరోపక్క ఈ డేట్స్ ఏంటి అనేవి కూడా వినిపిస్తున్నాయి. అయితే నవంబర్ లో ఆల్రెడీ దివాళీ సీజన్ డేట్స్ ముందే రాగా లేటెస్ట్ గా అయితే బుక్ మై షో లో అప్డేట్ చేసిన డేట్ వైరల్ గా మారింది.

దీనితో ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా అందులో పొందుపరిచారు. దీనితో ఇప్పుడు ఈ సరికొత్త డేట్ వైరల్ గా మారింది. అలాగే బుక్ మై షో లో పెట్టడంతో చాలా మంది ఈ డేట్ ని కూడా నమ్ముతున్నారు. మరి ఫైనల్ గా అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ కుమార్ విలన్ గా నటించారు. ఇక కేజీఎఫ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు.