ఫైనల్ గా “సలార్” లాస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే..!

గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో ఒక సరైన సినిమా ఇంకా పడలేదు. బహుశా గత ఏడాది లోనే చాలా చిత్రాలు వచ్చి హిట్ అయ్యాయి. కానీ ఈ ఏడాదిలో కొన్నే వచ్చినప్పటికీ అవి అంత హిట్స్ కాలేదు. మెయిన్ గా మన తెలుగు హీరో ఉన్న సినిమాలు కూడా లేవు.

కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన “ఆదిపురుష్” తో అల్రెడీ తాను వచ్చాడు కానీ అది డిజాస్టర్ అయ్యింది. ఇక నెక్స్ట్ రెండో సినిమా “సలార్ సీజ్ ఫైర్” తో ఈ ఏడాది బ్లాస్టింగ్ ఎండింగ్ అన్నట్టుగా రెండో సారి వస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా యూఎస్ బుకింగ్స్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అవుతున్నాయి. అయితే సలార్ చిత్రాన్ని ఇప్పుడు వరకు ఇండియన్ సినిమా దగ్గర ఎవరెవరు పంపిణీ చేస్తున్నారో రివీల్ చేశారు. ఇక ఈరోజు అయితే వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల్లో ఎవరి ద్వారా రిలీజ్ చేస్తున్నారో తమ ఫైనల్ డిస్ట్రిబ్యూటర్ ని తెలిపారు.

కాగా ఈ సినిమాని సహా అన్ని దేశాల్లో కూడా పార్స్ ఫిలిం కో ఎల్ ఎల్ సి వారు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలిపారు. వరల్డ్ వైడ్ సలార్ రిలీజ్ టైం లోనే షారుఖ్ ఖాన్ చిత్రం డంకీ అలాగే హాలీవుడ్ నుంచి భారీ చిత్రం ఆక్వా మ్యాన్ పార్ట్ 2 కూడా ఉన్నాయి. వీటితో మాత్రం ఓవర్సీస్ మార్కెట్ లో చాలా గట్టి పోటీ అప్పుడు నెలకొంటుంది అని చెప్పాలి. మరి ఈ పోటీలో సలార్ ఎలా రాణిస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. 
https://x.com/hombalefilms/status/1726098426629341520?s=20