“సలార్” ఫీవర్..తెలుగులో మొదటి షో ఎక్కడ ఎన్ని గంటలకంటే

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమానే “సలార్ సీజ్ ఫైర్”. కాగా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు.

కాగా ఈ చిత్రాన్ని అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనితో తెలుగు స్టేట్స్ లో కూడా భారీ ఎత్తున డిమాండ్ ఈ సినిమాకి నెలకొంది. దీనితోనే చాలా ఎర్లీగా సినిమా షోస్ పడనున్నాయని కూడా గట్టి టాక్ ఒకటి వైరల్ అవుతుండగా ఇప్పుడు ఆల్ మోస్ట్ కొన్ని చోట్ల మాత్రం తెల్లవారు 1 గంట సమయంలో షోస్ కొన్ని థియేటర్స్ కి ఫిక్స్ అయ్యిపోయాయని తెలుస్తుంది.

మెయిన్ గా హైదరాబాద్ లోనే పలు సింగిల్ స్క్రీన్స్ లో సలార్ ఒంటిగంట షోస్ పెడుతున్నారట. దాదాపు ఇవి ఖాయమే అని ఇప్పుడు సినీ వర్గాల్లో వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఇది ప్రస్తుతానికి తెలంగాణ వరకే కాగా ఏపీలో కూడా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.

అయితే ప్రస్తుతానికి నిర్మాతలు యూవీ క్రియేషన్స్ తో కలిసి ఏపీ ప్రభుత్వానికి మొదట టికెట్ రేట్స్ హైక్స్ కోసం అర్జీ పెట్టుకుంటున్నారని ఆ తర్వాత ఏమన్నా దీని కోసం అప్డేట్ తెలియొచ్చని సమాచారం. మొత్తానికి అయితే మాత్రం హైదరాబాద్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం లక్కీ అనే చెప్పుకోవాలి.