షాకింగ్ : ఫేక్ వసూళ్లతో బుక్కైన “సలార్”..ప్రూఫ్ కూడా 

నో డౌట్ గా ఇప్పుడు లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” కి మాసివ్ హైప్ ఉందని ఒప్పుకొని తీరాలి. కానీ లాస్ట్ చేసి మేకర్స్ చేసిన బ్లండర్స్ తో అయితే సినిమాకి చాలా దెబ్బ పడింది అనేది ఉన్న మాట.

సినీ పరిశ్రమలో పి ఆర్స్ మేకర్స్ పై పై మెరుగులు ఎన్ని దిద్ది సినిమాని హిట్ అని రుద్దాలని చూసినా అల్టిమేట్ గా ఆడియెన్స్ తోనే సినిమా రిజల్ట్ తేలిపోతుంది. అయితే ఇపుడు ఇదే విధంగా సోలార్ సినిమాకి జరిగింది. సినిమా లాస్ట్ చేసి ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం సినిమాకి ఎఫెక్ట్ కొట్టింది.

దీనితో దీని ప్రభావం సినిమా వసూళ్లపై పడింది. నిజానికి చిత్ర యూనిట్ సినిమా వసూళ్లు 178 కోట్ల పై మాట అంటూ ఒక నెంబర్ రిలీజ్ చేశారు. కానీ షాకింగ్ అంశం ఏమిటంటే హిందీ మార్కెట్ లో అది కూడా తెల్లారి లేస్తే చూసే న్యూస్ పేపర్ లో సలార్ సినిమా ఏకంగా 180 కోట్లు వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది అని పబ్లిసిటీ చేశారు.

దీనితో పొద్దున్న ఒక నెంబర్ మధ్యాహ్నం సోషల్ మీడియాలో క నెంబర్ ఇవ్వడంతో సలార్ వసూళ్ల విషయంలో మేకర్స్ ఫేక్ చేస్తున్నారని అందరికీ అర్ధం అయ్యిపోయింది. కాగా ఈ రెండిటిలో కూడా ఏది నిజమైన నెంబర్ కాదు అని ఇంకో రూమర్ కూడా ఉంది. వసూళ్లు 100 కోట్ల ఓపెనింగ్ రావచ్చు కానీ ఇంత మొత్తంలో సలార్ కి రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇలా ఫేక్ నంబర్స్ వేసుకోవడంతో హిందీ జనం కూడా సోషల్ మీడియాలో ప్రూఫ్స్ చూపించి మరీ ట్రోల్స్ స్టార్ట్ చేశారు.