ఇండస్ట్రీ బజ్ : “సలార్” ఇంగ్లీష్ రిలీజ్ లేట్.?

ఇప్పుడు ఇండియన్ సినిమా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. కాగా పలు భారీ చిత్రాలు ఇంగ్లీష్ ఆడియెన్స్ ని కూడా ఓ రేంజ్ లో అలరిస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ చిత్రాలు అయితే ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కానున్నాయి. అయితే మొదటగా ఈ స్టెప్ ని ఇప్పుడు ఉన్న హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నే అనౌన్స్ చేసాడు.

కాగా తన భారీ చిత్రం “కల్కి” అనౌన్స్ చేసినప్పుడే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగా ఇక దీనితో పాటుగా ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “సలార్” ని కూడా మేకర్స్ ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇప్పుడు సలార్ ఇంగ్లీష్ రిలీజ్ కి సంబంధించి కొన్ని రూమర్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే సలార్ కూడా ఇంగ్లీష్ లో అంతా ఇదే డేట్ లో రిలీజ్ చేస్తారు అని చాలా మంది అనుకున్నారు కానీ లేటెస్ట్ గా అయితే దీనిపై క్రేజీ టాక్ వైరల్ గా మారింది. సలార్ ని ముందు డేట్ కి కాకుండా అక్టోబర్ 13 న విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా దీనిపై మరి చిత్ర యూనిట్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా దీనిని కూడా భాగాలుగానే రిలీజ్ చేస్తున్నారు. అలాగే శృతి హాసన్ అయ్యితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.