ప్రభాస్ టీజర్ పై “సలార్” దర్శకుడి రివ్యూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన విజువల్ ఎక్స్ ట్రివంజా “రాధే శ్యామ్”. కంప్లీట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ తో అది నిజమే అని చూపించింది. ప్రభాస్ పోషించిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ టీజర్ భారీ రెస్పాన్స్ అందుకొని దూసుకెళ్తుండగా..

దీనిపై ఇప్పుడు ఇదే ప్రభాస్ తో భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” ను తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రివ్యూ తెలిపాడు. “రాధే శ్యామ్ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆగలేకపోతున్నానని” చాలా ఎక్సయిట్మెంట్ తో ప్రశాంత్ నీల్ తన రివ్యూ తెలిపాడు. మరి రాధే శ్యామ్ లో ఫుల్ క్లాస్ గా కనిపిస్తున్న ప్రభాస్ ని నీల్ మాత్రం తన సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ గా చూపిస్తున్నాడు. మరి సలార్ లో ప్రభాస్ ని ఫుల్ గా ఎలా చూపించనున్నాడో చూడాలి.