యూఎస్ గడ్డపై కనీవినీ ఎరుగని ఫీట్ సెట్ చేసిన “సలార్”

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో తెరకెక్కించిన మాసివ్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి కేజీఎఫ్ చిత్రాల ఫ్రాంచైజ్ తరహాలో ఇది కూడా భాగాలుగా పైగా దానితో కనెక్షన్ ఉన్న చిత్రంగా రాబోతుండడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది.

ఇక ఈ చిత్రం రిలీజ్ కి ఇంకాస్త సమయం ఉండగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ ఇండియన్ సినిమా నుంచి బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్నట్టుగా కన్ఫామ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ సమాచారం ఇపుడు బయటకి వచ్చింది. యూఎస్ లో ఓ ఇండియన్ సినిమాకి ఇది వరకు ఎన్నడూ లేని ఓ సెన్సేషనల్ ఫీట్ ని అయితే సలార్ చిత్రం ఇప్పుడు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

యూఎస్ లో ప్రముఖ సినీ మార్క్ అనే థియేటర్స్ సంస్థ అక్కడ అతి పెద్ద చైన్ థియేటర్స్ మార్కెట్ కాగా ఈ మొత్తం థియేటర్స్ లో కూడా సలార్ చిత్రం ఇపుడు రిలీజ్ కాబోతున్నట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు అనౌన్స్ చేశారు. దీంతో యూఎస్ గడ్డపై ఓ సినీ చైన్ మొత్తం లో కూడా మొట్టమొదటి సారిగా ఓ ఇండియన్ సినిమా టోటల్ ఆక్యుపెన్సీ తో రిలీజ్ కాబోతున్న సినిమాగా ఇప్పుడు సలార్ అయితే నిలిచింది.

దీనితో ఇది తమకి ఎంతో గర్వకారణం అని డిస్ట్రిబ్యూషన్ వారు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ విలన్ గా నటించాడు. అలాగే వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.