పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “సలార్” కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ కి ఫైనల్ గా సరికొత్త డేట్ ని డిసెంబర్ కి మేకర్స్ లాక్ చేశారు. మరి ఈ చిత్రంని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కేజీఎఫ్ ఫ్రాంచైజ్ లో భాగంగానే తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా డిసెంబర్ 22 కావాలనే అనౌన్స్ చేసారో ఏమో కానీ సరిగా అదే రోజులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రమ్ “డున్కి” అయితే విడుదల కానుంది. షారుక్ నటించిన రెండు సినిమాలు ఆల్రెడీ ఈ ఏడాదిలో వచ్చి ఒకదాన్ని మించి ఒకటి సెన్సేషనల్ హిట్స్ కాగా..
ఈ సినిమాలు తర్వాత అందులోని బాలీవుడ్ టాప్ దర్శకుడు అయినటువంటి రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కానీ ఇది మాత్రం ప్రభాస్ సలార్ ముందు నిలవలేదని తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలకి మెయిన్ గా థియేటర్స్ ఇష్యూ ఉంటుంది అని ముందే అర్ధం అయ్యింది.
కానీ ఈ రెండు సినిమాల్లో మాత్రం ఇండియా నుంచి యూఎస్ వరకు కూడా సలార్ డామినేషన్ మాత్రమే కనిపిస్తుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. షారుఖ్ ఖన్నా కూడా ప్రభాస్ చిత్రానికే ఎక్కువ థియేటర్స్ స్క్రీన్ లు డిస్ట్రిబ్యూటర్లు కేటాయిస్తున్నారట. అంతే కాకుండా నార్త్ లో కూడా డున్కి కంటే సలార్ కే ఎక్కువ స్క్రీన్స్ ఇస్తున్నారని అంటున్నారు. దీని బట్టి సలార్ క్రేజీ డామినేషన్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాల్సిందే. ఇక రిలీజ్ అయ్యాక మాత్రం వసూళ్లు ఎలా ఉంటాయి.