‘సలార్‌’ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదుర్స్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‌. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ రాబడుతున్నది.

అయితే ప్రశాంత్‌నీల్‌ సినిమాలలో పాటల కంటే బీజీఎం(బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌)కే ఎక్కువ క్రేజ్‌ ఉంటుదన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించడానికి కూడా ముఖ్య కారణం బీజీఎం. రాఖీ ఎలివేషన్‌ అప్పుడు అయినా , గరుడ ఎంట్రీ సీన్‌ అయినా సినిమాను నడిపించింది బీజీఎం అని చెప్పకతప్పదు.

ఇదిలావుంటే.. లేటెస్ట్‌గా వచ్చిన ‘సలార్‌’లో కూడా బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. ముఖ్యంగా ప్రభాస్‌ ఎంట్రీ బీజీఎం గూస్‌ బంప్స్‌ తెప్పిచింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘సౌండ్‌ ఆఫ్‌ సలార్‌’ పేరుతో ఈ వీడియోను విడుదల చేయగా.. రవి బస్రూర్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్‌ ట్రాక్‌ ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది.