“ఓజి” పై “సలార్” నటి క్రేజీ కామెంట్స్.. 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర అదరగొడుతున్న నయా చిత్రాల్లో బాక్సాఫీస్ మాన్స్టర్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సలార్” కూడా ఒకటి. మరి హిందీ సహా తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలో కూడా సలార్ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి.

కాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన కీలక నటుల్లో అగ్రెసివ్ నటి పొగరు ఫేమ్ శ్రేయ రెడ్డి తాజాగా టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఓజి” పై క్రేజీ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆమె ఇపుడు పవన్ మరియు సుజీత్ కాంబినేషన్ లో దీనిని తెరకెక్కిస్తుండగా ఆమె ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో ఆమె నటిస్తుంది.

అయితే ఆమె ఈ సినిమా కోసం మాట్లాడుతూ ఈ చిత్రం రిలీజ్ కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఆ సినిమా తప్పకుండా ఫస్ట్ డే మిస్ కాకుండా చూస్తానని అంతలా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ చాలా వండర్ ఫుల్ పర్సన్ అని సెట్స్ లో చాలా హుందాగా సింపుల్ గా ఉంటారని.

తనని మొదటి సారి మీట్ అయ్యినప్పుడు తన నుంచి ఆ తరహా రిసీవింగ్ ఉంటుంది అనుకోలేదని చాలా ఎగ్జైట్ అవుతూ ఆమె తెలిపింది. ఈమె కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో మరియు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మరి ఓజి లో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి మరి.