గాసిప్స్ : “సలార్” విలన్ దర్శకత్వంలో ప్రభాస్??

పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా ఇపుడు చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన మాసివ్ యాక్షన్ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో లింకప్ ఉన్న చిత్రంగా దీనిని కూడా భాగాలుగా చేస్తుండడంతో భారీ హైప్ దీనిపై నెలకొంది.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటుగా ఎంతోమంది భారీ తారాగణం కనిపించనుండగా ఈ సినిమాలో మలయాళం కి చెందిన ప్రముఖ స్టార్ హీరో పృథ్వీ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్ర చేసాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ విలన్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ స్టార్ నటుడు ఇప్పుడు ప్రభాస్ కోసం ఓ ఊహించని స్టోరీ రాసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రం కోసం ఓ పవర్ ఫుల్ లైన్ ని పృథ్వీ రాసుకోగా ప్రభాస్ కి కూడా అది చెప్పాడని తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఇంకా ఈ సినిమా విషయంలో ఫైనల్ డెసిషన్ చెప్పాల్సి ఉందట. దీనితో ఈ మాసివ్ ప్రాజెక్ట్ విషయంలో ఓ తుది క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఇపుడు ప్రభాస్ సలార్ పనుల్లో బిజీగా ఉండనుండగా రానున్న రోజులలో సలార్ నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందించాడు. అలాగే కేజీఎఫ్ నిర్మాతలే విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.