బాక్సాఫీస్ : “సలార్” 2 డేస్ వరల్డ్ వైడ్ ఎంతంటే..

ఈ ఏడాది ఎన్నో అంచనాలు నడుమ టాలీవుడ్ సహా పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఈ డిసెంబర్ బ్లాస్ట్ గా వచ్చిన చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఎన్నెన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం హీరో ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సెన్సేషన్ ని సెట్ చేసింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి మొదటి రోజు వచ్చిన వసూళ్లకు కాస్త డిఫరెన్స్ ఉంది అని గట్టి ట్రోల్స్ కూడా వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం డే 1 కి 178 కోట్లకి పైగానే అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక రెండో రోజు అయితే మరో 110 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుని భారీ మొత్తం 295.7 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది.

మరి రెండు రోజుల్లోనే ఈ మార్క్ అంటే సంచలనం అని చెప్పాలి. మెయిన్ గా తెలుగు మరియు యూఎస్ మార్కెట్ లో సలార్ కి రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. మరి ఒరిజినల్ గా కాస్త తేడా ఉండొచ్చు కానీ మేకర్స్ అయితే అఫీషియల్ గా 297 కోట్లనే అనౌన్స్ చేశారు.

సో ఫైనల్ మార్క్ గా అదే పరిగణిస్తారు. మరి ఈ ఆదివారం కూడా ఇంకో 100 వేసుకుంటే మూడు రోజుల్లో సలార్ భారీ మొత్తం 400 కోట్ల మార్క్ దరిదాపుల్లోకి వచ్చేస్తుంది అని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ నుంచి ఎక్కడ ఆగుతుంది అనేది ఇపుడు అందరిలో ఆసక్తిగా మారింది. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్, జగపతి బాబు, బాబీ సింహ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.