అందాల నిధులను తెరబెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ!!

Sakshi Agarwal

అందాల ఆరబోతలోనూ ఓ పద్దతి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందాల ప్రదర్శనలో ఒకరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు. ఆ అందరిలో సాక్షి అగర్వాల్ అనే కోలీవుడ్ కుందనపు బొమ్మ మాత్రం వేరే లెవెల్. బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్‌లో గ్లామర్ డోస్‌ను తగ్గకుండా చూసుకుంది సాక్షి. సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన క్రేజ్ కంటే.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫాలోయింగే ఎక్కువే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

Sakshi Agarwal
Sakshi Agarwal

నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో షూట్‌తో సాక్షి అగర్వాల్ రచ్చ రచ్చ చేస్తోంది. అడువుల్లో చెట్లు పుట్టలపై, ఏనుగులతో దిగుతూ చేసే ఫోటో షూట్లతో హల్చల్ చేస్తోంది. అయితే ప్రస్తుతం తనకున్న ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేయడానికి, శరీరాకృతిలో ఇంతలా మార్పు రావడం వెనుక ఎన్నో యేళ్ల శ్రమ ఉందని చెబుతూ ఉంటుంది. చిన్నతనంలో ఎన్ని అవమానాలకు గురైందో ఆ మధ్య షేర్ చేసిన సంగతులు తెగ వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా సాక్షి షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చీర కట్టులో సాక్షి షేర్ చేసే ఫోటోలు నెట్టింట కుంపటిని పెడతాయి. అలాంటి మోడ్రన్ డ్రెస్‌లో అందాలను కనిపించి కనిపించనట్టుగా చూపించి చూపించనట్టుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలను చూస్తే సాక్షి అగర్వాల్ అందాల ఆరబోత పీహెచ్‌డీ చేసిందా?అనే అనుమానం కలగకమానదు. తాను ఎవ్వరితోనూ పోల్చుకోనని, ఎందుకుంటే తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకొచ్చింది.