పొట్టి డ్రెస్సులతో, సగం సగం పీలికలతో హాట్ గా కనిపించడం ఒక రకం. అలాగే సంప్రదాయ దుస్తులకు కొన్ని ఫ్యాషన్ హంగులు అద్ది అందాన్ని ఆరబోయడం మరొక రకం.
అలాంటి ఒక సంప్రదాయ దుస్తులను అనువుగా మార్చుకొని కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది సాక్షి అగర్వాల్. దీపాల వెలుగుల మధ్య కుంకుమ రంగు జుట్టుతో తళతళా మెరుస్తున్న ఆమె మేని గురించి ఎంత చెప్పినా తక్కువే. వయ్యారాలను ఒలకబోస్తూ తన మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపే ఫోజులు బయటకు వచ్చాయి.
తమిళంలో కొన్ని మంచి చిత్రాల్లోనే నటించిన సాక్షి ఎక్కువగా పేరు తెచ్చుకుంది మాత్రం బిగ్ బాస్ టీవీ షో కి వెళ్ళిన తరువాతనే. ఆ తర్వాత కొన్ని మంచి పాత్రలు ఈ గ్లామర్ డాల్ వెంట రాగా ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతూ ఇలా అప్పుడప్పుడూ వచ్చి యూత్ ను తన అందాలతో ఆటాడించి వెళ్ళిపోతుంది.