‘సైనా’ బయోపిక్: ఆకట్టుకుంటున్న మిని సైనా లుక్ !

బాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఎటువంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్‌ బాలీవుడ్‌ సెట్స్‌పై రన్‌ అవుతూనే ఉంటుంది. వారు బయోపిక్‌ తీయడానికి కాస్త రీజన్‌ ఉంటే చాలు.. బయోపిక్‌కి లైన్‌ క్లియర్‌ అయినట్లే. ఇక భారతదేశానికి బ్యాడ్మింటన్‌లో తొలి ఒలంపిక్ పతకం తీసుకొచ్చిన ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత నేపథ్యంలో సైనా అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సైనా పాత్రలో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా నటిస్తుంది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను అమోల్ గుప్తా తెరకెక్కించగా, మార్చి 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సినిమా కోసం పరిణితీ పరిణితీ బాట్మింటన్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు దాదాపు 10 కేజీ బరువు కూడా తగ్గింది.సైనా నెహ్వాల్‌.. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐదు పతకాలు , అర్జున అవార్డుతో పాటు రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కించుకుంది. ఆమె జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా సైనా పాత్ర పోషిస్తున్న పరిణితీ లుక్ ఒకటి విడుదలైంది. దీనికి సైనా.. లవ్ లీ లుక్..మినీ సైనా అంటూ కామెంట్ పెట్టింది. పరణితీ చోప్రా లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. కాగా, సైనా పోస్టర్‌పై ఇటీవల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా, సైనా పోస్టర్‌లో షటిల్ కాక్‌ను సర్వ్ చేస్తున్నట్టు చూపించారు. దీనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు