బిజెపిలోకి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ .. బ్యాట్ ని విడిచి బిజెపి జెండా పట్టుకున్నారు. తాజా ఆమె బిజెపి పార్టీలో చేరారు. ఢిల్లి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హర్యానా కు చెందిన సైనా నెహ్వాల్, ఆమె అక్క చంద్రాంశు బిజెపి లో చేరడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశాభివృది కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఆదర్శమని ఆమె చెప్పారు. ప్రధాని తరహాలో తాను కూడా దేశానికి సేవ చేసేందుకే బిజెపి లో చేరుతున్నట్టు ప్రకటించారు.

తాజాగా ప్రెస్ మీట్ లో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ చాలా కాలంగా నేను బిజెపి కి సపోర్ట్ గా ఉన్నాను. బిజెపి ప్రభుత్వం లోని ఎం డి ఏ ప్రభుత్వం ఏంతో కృషి చేస్తుందని తెలిపారు. నేను కష్టపడి పనిచేసే క్రేడాకారిణిని, నా తరహాలో కష్టపడి పని చేసేవారితో పని చేయడం నాకు ఇష్టం అంటూ చెప్పారు. ఢిల్లీ బిజెపి శాఖలో చేరిన సైనా ఆ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను కలిశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా ప్రోగ్రాం తనకు బాగా నచ్చిందని అన్నారు. లాండన్ లో 2012 లో జరిగిన ఒలంపిక్ క్రీడల్లో దేశానికి మొదటి రజత పథకాన్ని సాధించిన ఘనత ఆమెది. ఇక బిజెపి లో చేరారు కాబట్టి.. ఢిల్లీ లో ప్రచారం చేయడానికి రెడీ ఐయ్యారు.