టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఫిదా మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఫిదా మూవీ చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం పొందింది. సాయి పల్లవి తన అద్భుతమైన నటనలు డాన్సులతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలాగే వరుసగా తెలుగు చిత్రాలు చేసింది. ఇలా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది. సాయి పల్లవి నటించిన చిత్రం విరాటపర్వం.
ఈ చిత్రంలో రానా సరసన ఆమె నటించింది. ఈ సినిమా జూన్ 17వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనప్పుడు తన వ్యక్తిగత విషయాలను తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.
ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను నాన్ వెజ్ తిననని చెప్పింది. అయితే ప్రేమించిన వ్యక్తి కోసం చికెన్ షాప్ లో నాన్ వెజ్ కొనుగోలు చేసి తనకి వండి పెడతానని తెలిపింది. ఇదే సమయంలో పెళ్లి విషయం మాట్లాడుతూ తెలుగు అబ్బాయినీ మాత్రమే చేసుకుంటాను లేకపోతే సింగిల్ గానే ఉండి పోతాను అని ఆమె చెప్పడం జరిగింది.
అయితే ఈ వైరల్ న్యూస్ ఎంత వరకు నిజం..
అయితే సాయి పల్లవి చేసిన కామెంట్లను విన్న ప్రేక్షకులు ఆమె తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ సాయి పల్లవి చేసిన కామెంట్ ను ట్యాగ్ చేసి మరీ వైరల్ చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి అని ఆమె అప్పుడు పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆ హీరో కూడా సింగిల్ గానే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తు అయితే ఈమె ప్రేమిస్తున్న ఆ హీరో ఎవరా అని పెద్ద ఎత్తున ఆరా తీసి ఆ టైంలో ఈ ఫేక్ న్యూస్ నీ వైరల్ చేశారు.
త్వరలో ఆ హీరో పేరు వెల్లడించి సాయి పల్లవి షాక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తరువాత విరాటపర్వం సినిమా విడుదలైన తన ప్రేమ పెళ్లి గురించి సాయి పల్లవి ఆ వ్యక్తి తనకు ఉన్న ప్రేమ గురించి బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారని చాలామంది అనుకున్నారు. అయితే అది అబద్దం అని తేలిపోయింది. సాయి పల్లవి వయస్సు ప్రస్తుతం వయస్సు 30 సంవత్సరాలు అనే సంగతి అందరికి తెలిసిందే.
సాయి పల్లవి గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకున్న అతనిపై, కెరియర్ పై పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే లేదని గట్టిగా చెప్పవచ్చు. అయితే పెళ్లి పిల్లల వంటి కీలక విషయాలలో సంబంధించి ఆమె అడుగు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. అయితే ఈమె ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు.. మాత్రం ఎంతో ఆతృత పడుతున్నారు.