సాయి పల్లవిది సాహసమనే చెప్పాలి.. అడవిలో అలా!!

Sai Pallavi Enjoy In Forest

సాయి పల్లవి పేరు వింటే చాలు ఆమె పాత్రలు, ఆమె క్యారెక్టర్ ఇలా అన్నీ గుర్తుకు వస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ పేరు.. తక్కువ సినిమాలతో స్టార్ స్టేటస్ అందరికీ దొరకదు. తెరపై సహజంగా నటించడం కాదు.. తెర వెనుక కూడా అంతే సహజంగా బతకాలి. అప్పుడే సాయి పల్లవి లాంటి క్రేజ్ అందరికీ దక్కుతుంది. డబ్బు కోసం ఎన్నడూ వెంపర్లాడని మనస్తత్వమే కోట్ల మంది అభిమానులను తెచ్చిపెట్టింది.

Sai Pallavi Enjoy In Forest
Sai Pallavi Enjoy In Forest

చేసిన సినిమాలు, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఓ సారి సరిగ్గా గమనిస్తే ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ కావు. కానీ అందులో మాత్రం కచ్చితంగా సాయి పల్లవి మార్క్ ఉంటుంది.అదే ఆమె ప్రత్యేకత. కోట్ల రూపాయలు కుమ్మరించినా సరే సౌందర్య ఉత్పత్తుల ప్రకటనలు చేయదు. సహజంగా ఉండాలని, ఇలా వాడమని తాను ఎవ్వరికీ చెప్పనని కోట్ల ఆఫర్లను వదులుకుంది.

Sai Pallavi Enjoy In Forest
Sai Pallavi Enjoy In Forest

సాయి పల్లవి ప్రకృతి ప్రేమికురాలు. వర్షం పడుతుంటే.. చల్లని సాయంత్రం అలా ఉంటే.. ఫ్యామిలీతో అలా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంది. అడవుల్లో ప్రయాణం చేస్తుంది. ఆ మధ్య ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన వీడియో షేర్ చేయగా అది తెగ వైరల్అయింది. తాజాగా సాయి పల్లవి అడవిలో విన్యాసాలు చేసింది. ఊడలను పట్టుకుని వేలాడుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.