మహేష్ కోసం దొంగగా మారిన సాయి పల్లవి.. ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా సెలబ్రెటీలకు స్వేచ్ఛ వుండదనే విషయం మనకు తెలిసిందే సెలబ్రెటీలు వారి వ్యక్తిగత అవసరాల కోసం బయటకు వచ్చిన పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు వారి స్వేచ్ఛకోసం విదేశాలకు వెళ్లి అక్కడ షాపింగ్ చేయడమే కాకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా విదేశీ పర్యటనలకు సాయి పల్లవి చాలా దూరంగా ఉంటారు. ఈమె హైదరాబాద్లోనే మారువేషంలో అభిమానుల కంటికి కనపడకుండా తనకు నచ్చిన విధంగా బ్రతుకుతున్నారు.

ఈ క్రమంలోనే సాయిపల్లవి మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా దొంగగా మారిపోయింది.మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా చూడటం కోసం తనని ఎవరూ గుర్తు పట్టని విధంగా సాధారణ డ్రెస్ ధరించి మాస్క్ వేసుకొని హైదరాబాద్ లోని . హైదరాబాద్ pvk ఆర్ కె సినీ ప్లెక్స్ లో సాధారణ అభిమానిగా ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమాని వీక్షించారు. అనంతరం సాయిపల్లవి తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఎంతో సాధారణంగా ఎవరు గుర్తించలేని విధంగా బయటకు వచ్చి తన కారు ఎక్కి వెళ్ళిపోయారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్లో సినిమాను చూసిఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ థియేటర్ బయట మాత్రం ఒక దొంగగా ఎవరి కంటికి కనిపించకుండా తన కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఇక ఈ విషయాన్ని సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తే ఈ వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మహేష్ సినిమా కోసం సాయి పల్లవి పెద్ద సాహసం చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే సాయిపల్లవి ఇదివరకే పవన్ కళ్యాణ్ సినిమా, శ్యామ్ సింగరాయ్ సినిమాను చూడటానికి కూడా ఇలా మారువేషంలో వెళ్లిన సంగతి తెలిసిందే.