Sai Dharam Tej : ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాలో మెలోడీ సాంగ్ ను విడుదలచేసిన మెగా హీరో..!

Sai Dharam Tej : సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా శ్రీదేవి శోభన్ బాబు. సంతోష్ శోభన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోనే. ఇప్పటికే సంతోష్ శోభన్ తెలుగులో ‘పేపర్‌ బాయ్‌’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఏక్‌ మినీ కథ’ వంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు.ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన గౌరి జీ కిషన్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే  ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహారిస్తుండటం విశేషం.ఈ సినిమా నుంచి గుడ్ ఫ్రైడే సందర్భంగా ‘నిను చూశాక..’ అనే పాటను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పాట విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పాటకు కమ్రాన్ స్వరాలు అందించారు.రాకేందు మౌళి ఈ పాటను రచించగా, సింగర్ జునైద్ కుమార్ ఆలపించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. సుష్మిత కొణిదెల ఈ సినిమాకు నిర్మాత గా నే కాకుండా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గానూ వర్క్ చేశారు.వేర్వేరు మనస్తత్వాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే సంఘర్షణ, ప్రేమ వంటి ఎలిమెంట్స్‌ను హైలెట్స్ చేస్తూ తెరకెకుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అల్లరిస్తుందో చూడాలి.